విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మొదటి రెండు పాటలు సూపర్ హిట్ కావడంతో థర్డ్ సింగిల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ థర్డ్ సింగిల్ పొంగల్ సాంగ్‌ని విడుదల చేసింది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పొంగల్ స్ఫూర్తిని క్యాప్చర్ చేసింది. వెంకటేష్, మైపిలో రోహిణి సోరట్, భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ వోకల్స్‌తో అదరగొట్టారు.