ముంపు బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం
అన్నమయ్య ప్రాజెక్టు, ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తో కలిసి ఆయన ముంపు ప్రాంతమైన పుల పుత్తూరు గ్రామంలో పర్యటించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.