రాయచోటి: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి హెచ్చరించారు. సోమవారం పీలేరు - కడప ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని ఫుట్ పాత్ పై అడ్డంగా ఉంచిన తోపుడు బండ్లను తొలగించారు. రాయచోటి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఆయన సూచించారు.