ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
ఎన్డీఏ కూటమి ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఆదివారం వీరబల్లి మండలం పెద్దివీడు గ్రామం రెడ్డివారి పల్లె నందు జరుగుతుందని మండల టిడిపి నాయకులు తాటిగుట్ల శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాజంపేట నియోజకవర్గ టిడిపి బాధ్యులు పార్టీ సుగవాసి బాలసుబ్రమణ్యం హాజరవుతారని ఆయన తెలిపారు.