
రాయచోటిలో జాతీయ వినియోగదారుల దినోత్సవం
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కామర్స్ విభాగంలో అధ్యాపకులు ప్రసాద్, శ్రీనివాసులు జాతీయ వినియోగదారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వాటి ధరలను, నాణ్యతలను, కాలం చెల్లిన వస్తువులను తెలుసుకొని కొనుగోలు చేయాలని వినియోగదారులు వస్తువులు కొనుగోలు పై మోసం జరిగినట్లయితే నష్టపరిహారం ఏ విధంగా పొందాలో, వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు తెలిపారు.