‘గడ్డం గీసుకోండి.. ప్రేమలో పడండి’.. అమ్మాయిల నిరసన (VIDEO)
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కృత్రిమ గడ్డం పెట్టుకున్న కొందరు అమ్మాయిలు ఇండోర్ వీధుల్లో అబ్బాయిల గడ్డానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘నో క్లీన్ షేవ్.. నో లవ్’, ‘గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి’ అంటూ ఫ్లకార్డుల మీద అమ్మాయిలు నినాదాలు రాసుకుని వీధుల్లో తిరిగారు. ఆ అమ్మాయిల నిరసనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.