ఐఆర్సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం
రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఏర్పాటు చేసిన IRCTC వెబ్ సైట్, యాప్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనిపై స్పందించిన IRCTC.. మెయింటెనెన్స్ పనుల కారణంగా.. ఈ టికెట్ సేవలు అందుబాటులో లేవు. టికెట్ రద్దు చేసుకోవడానికి ఫైల్ టీడీఆర్ కోసం కస్టమర్ కేర్ నెంబర్ 14646, 08044647999, 08035734999కు ఫోన్ లేదా etickets@irctc.co.in కు మెయిల్ చేయండి.' అని IRCTC వెబ్సైట్లో తెలిపింది.