ఏపీ అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అసెంబ్లీ, మండలిలో జాతీయ ఈ విధాన్ యాప్- నేవా అమలుకు ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ కార్యకలాపాలకు ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ ఈ యాప్ను రూపొందించారు. దీని ద్వారా అసెంబ్లీ కార్యకలాపాలన్నీ కాగిత రహిత విధానంలో అమలు చేసేందుకు సాధ్యం కానుంది. అసెంబ్లీ, మండలిలో సభ్యులకు డ్యాష్ బోర్డు, ప్రత్యేక ట్యాబ్లను అధికారులు అందజేయనున్నారు.