దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా హెచ్‌ఐవీ కేసులు నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 2023-24 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2,22,338 హెచ్‌ఐవీ కేసులు ఉన్నాయి. వీరిలో పురుషులు 99,455, మహిళలు 1,22,124, హిజ్రాలు 759 మంది ఉన్నారు. 2019-20లో ఏపీలో 1,92,693 మంది హెచ్‌ఐవీ బారినపడగా.. పురుషులు 86,495, మహిళలు 1,05,671, హిజ్రాలు 527 మంది ఉన్నారు. 2010-11 నుంచి పరిశీలిస్తే కొత్తగా నమోదవుతున్న హెచ్‌ఐవీ కేసులు తగ్గుముఖం పట్టాయి.