ఏపీలో దారుణం జరిగింది. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం ఎర్రగరువు గ్రామంలో ఆస్తి సరిహద్దు తగాదాల్లో ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. భార్యాభర్తలపై కత్తితో జి.రాధాకృష్ణ విచక్షణారహితంగా దాడి చేశారు. క్షతగాత్రులు జి.సత్యనారాయణ, ఆయన భార్యను యానాం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని ఐ.పోలవరం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.