ఏపీలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్

67చూసినవారు
ఏపీలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తొలి విడతలో రూ.55 కోట్లతో 129 ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.5 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఈ ప్రాజెక్టు వ్యయం ఉండనుంది. నవంబర్ రెండో వారంలో వీటిని ప్రారంభిస్తారు. మొత్తం వ్యయంలో 35 శాతం రాయితీ ఉండగా.. లబ్ధిదారుడు 10 శాతం వాటా చెల్లించాలి. మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణం అందిస్తుంది.

సంబంధిత పోస్ట్