సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో సోమవారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాల్లో రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. 40 లక్షల ఎన్. ఆర్. ఇ. జి. ఎస్ నిధులతో గ్రామంలో నిర్మిస్తున్న అంతర్గత సిమెంట్ రోడ్లు మరియు సైడ్ కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.