గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

82చూసినవారు
గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
కురుక్షేత్ర-ఖజురహో మధ్య నడిచే గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలోని ఇషానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించగా.. వారు మంటలను ఆర్పివేశారు. కోచ్ దిగువ భాగంలో రబ్బరు వేడెక్కడం వల్ల మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్