ఒంగోలు: సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం షేర్ చేయవద్దు
సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు షేర్ చేయవద్దని జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వంటి వివరాలు, ఇతర విలువైన వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకూడదన్నారు. దీని వలన సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.