
తాళ్లూరు: రైతులందరూ విశిష్ట సంఖ్య కోసం నమోదు చేసుకోవాలి
తాళ్లూరు మండలంలోని శివరాంపురం రైతు సేవా కేంద్రం వద్ద మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో రైతు విశిష్ట సంఖ్య నమోదు కార్యక్రమం మీద రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ మండలంలో ఇంకా 30% మంది రైతులు రైతు విశిష్ట సంఖ్య కోసం నమోదు కాలేదని, వారందరూ త్వరలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.