ఒంగోలు: హెల్మెట్ వాడకం ఆవశ్యకతపై అవగాహన
హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులో శుక్రవారం రాత్రి ప్రజలకు హెల్మెట్ వాడకం ఆవశ్యకతపై ఆయన అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ ఎక్కువమంది తలకు గాయం కావడం వల్లే చనిపోతున్నారన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలో పాటించి తమను తాము కాపాడుకోవాలన్నారు.