హలీం గింజలను తింటే ఒత్తిడి నుంచి ఉపశమనం
హలీం గింజలను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. హలీం గింజలను తినడం వల్ల జీర్ణ, శ్వాస సమస్యలు తొలగిపోతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చర్మ సౌందర్యం మరింత మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. రక్తహీనత సమస్య కూడా నయమవుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా హలీం గింజల్లో ఉండే విటమిన్ ఎ, ఇ.. చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాయి.