పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా చేస్తా: సునీతారావు
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నన్నుఎమ్మెల్సీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా చేస్తా. పీసీసీ చీఫ్ ని కూడా అడ్డుకుంటా. ఒక బీసీ మహిళగా, ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి అన్ని రకాలుగా నేను అర్హురాలిని. మహిళా కాంగ్రెస్ పైన 150కి పైగా కేసులు నమోదయ్యాయి' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.