మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాసిక్‌లోని యోలా సమీపంలోని నగర్-మన్మాడ్ హైవేపై మంగళవారం అర్థరాత్రి అతివేగంగా వెళుతున్న కారు, ఓ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడే మరణించగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.