ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన
AP: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టులకు సొంతింటి కల త్వరలో నెరవేరనుందని తెలిపారు. మంగళవారం హిందూపురంలో ప్రెస్‌క్లబ్ ఆధునీకరణ భవనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. జర్నలిస్టుల ప్రాణాలు పణంగా పెట్టి వార్తలు సేకరిస్తారన్నారు. జర్నలిస్టుతో కలిసి హిందూపురం అభివృద్ధి సమస్యలపై చర్చిస్తామని, త్వరలో ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు.