చిత్తూరు: నిరుద్యోగులకు గుడ్ న్యూ్స్
చిత్తూరు మండలం ఇరువారం సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో మంగళవారం జాబ్ మేళా జరుగుతుందని చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ తెలిపారు. ఈ జాబ్ మేళాకు నాలుగు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ లేదా బీఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.