టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది వేడుకలు మార్చి 25వ తేదీ బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో
ఘనంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా టిటిడి పంచాంగ పరిష్కర్త ఆచార్య వేదాంతం విష్ణుభట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తారు.
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శ్రీ నేమాని పార్ధసారధి ఆధ్వర్యంలో భాగవత పద్యగోవిందం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగవత
పద్యాలకు సరళ వ్యాఖ్యానంతో చిన్నారులు పద్యగాన కచేరి చేపడతారు. అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లలతో వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి
ప్రసాద వితరణ ఉంటుంది.