ఏపీకి మరో ముప్పు పొంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీన రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.