గూడూరు: వ్యక్తి అనుమానాస్పద మృతి
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలంలో ఓ వ్యక్తి ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. సిద్ధవరంలోని ఓ బ్రాందీ షాప్ సమీపంలో రాయపు సుధాకర్ (48) రక్తం మడుగులో విగత జీవిగా మృతి చెందారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాం వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.