Apr 26, 2025, 16:04 IST/
రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాలు
Apr 26, 2025, 16:04 IST
TG: రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు ములుగు, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ జిల్లాల్లో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారి చేసింది.