నగరి: పెండింగ్ జీతాలను వెంటనే మంజూరు చేయాలి
నగరి మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఆయమ్మల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కార్యాలయం ఎదుట మండల అధ్యక్షురాలు లక్ష్మీ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలకు, స్కూల్ వాచ్మెన్ లకు 5 నెలల జీతాలు ప్రభుత్వం వెంటనే విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.