
నగిరి: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను: ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు నాయకులు శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేశారు. వాటిని స్వీకరించిన ఆయన త్వరితగతిన పరిష్కారానికి చొరవ చూపుతానని తెలిపారు.