నగిరి: ప్రజలకు తప్పని పాముల బెడద
నగిరి మండలం గుండ్రాజ కుప్పం దగ్గర సోమవారం కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లోకి పాము దూరి హల్చల్ చేసింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ తమకు పాముల బెడద కాస్త ఎక్కువగానే ఉందని వాటి బెడద తప్పడం లేదని తెలిపారు. అనంతరం స్నేక్ క్యాచర్ శ్రీకాంతకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న ఆయన పామును సురక్షితంగా పట్టుకొని స్థానిక అటవీ ప్రాంతంలో వదిలి వేసినట్లు చెప్పారు.