వైసీపీ కౌన్సిలర్ వేధించాడని ఆత్మహత్యాయత్నం.?
పలమనేరుకు చెందిన ఓ యువతి తాను వాలంటీర్ గా పని చేసేటప్పుడు వైసీపీ కౌన్సిలర్ హైదర్ అనేక సార్లు లైంగికంగా వేధించాడని శుక్రవారం ఆరోపణలు చేసింది. నేడు ఆమె మాట్లాడుతూ, హైదర్ వద్ద తాను బంగారు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నానని, డబ్బు ఇచ్చినా బంగారం ఇవ్వలేదని బాధితురాలు వాపోయింది. అతని లైంగిక వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. తనను ప్రభుత్వం న్యాయం చేయాలని కోరింది.