ఏర్పేడు: హత్య కేసులో ముద్దాయిలకు జీవిత ఖైదు
ఏర్పేడు మండలం మర్రిమంద బాపూజీ స్కూల్ దగ్గర 2020లో మునస్వామి అనే వ్యక్తిని హత్య చేసిన నిందితులకు గురువారం శ్రీకాళహస్తి కోర్టు జీవిత ఖైదు, ఒక్కొక్కరికీ రూ. 10 వేలు జరిమానా విధించింది. ఇంటికి సంబంధించి భూమి విషయంగా జరిగిన ఆస్తి తగాదాలలో మునస్వామి అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన నేపాల్, కుమారస్వామి హత్య చేశారు. నిరూపణ కావడంతో శ్రీకాళహస్తి 12వ ఏడీజే న్యాయమూర్తి శ్రీనివాస నాయక్ శిక్ష ఖరారు చేసినట్లు సీఐ జయచంద్ర తెలిపారు.