అమలాపురం: బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

71చూసినవారు
అమలాపురం ఆర్టీసీ డిపోలో నూతనంగా మంజూరైన ఐదు బస్సులను ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు. 5 బస్సులను బస్ కాంప్లెక్స్ వద్ద ఆదివారం జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ బస్సులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు నడుపుతామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఆముడా ఛైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, డిపో మేనేజర్ సత్య నారాయణమూర్తి ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you