
అమలాపురం: అంగన్వాడీ కేంద్రాలు పునాదులుగా నిలవాలి
ఆరోగ్య కరమైన సమాజ స్థాపనకు అంగన్వాడీ కేంద్రాలు పునాదులుగా నిలవాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ సూచించారు. ఆయన అమలాపురం, అల్లవరం మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను బుధవారం సందర్శించి విద్యార్థులకు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారాన్ని మధ్యాహ్న భోజన పథకం పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత నిర్వాహకులకు ఆయన సూచనలు చేశారు.