అమలాపురంలో నూతన విద్యుత్ టవర్ల నిర్మాణం
అమలాపురం పట్టణంలో విద్యుత్ శాఖ నూతనంగా టవర్ల నిర్మాణం చేపట్టారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలో నూతనంగా టవర్లను నిర్మిస్తుంది. పట్టణంలో విద్యుత్ స్తంభాలపై విద్యుత్ తీగలు కింద భాగంలో ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు, భారీ వాహనాలు, తుఫాన్ గాలులకు, చెట్లు పడి తెగిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పట్టణంలో 8 ప్రాంతాల్లో భారీ టవర్ల నిర్మాణం చేపట్టారు. ఈ పనులు ఆదివారం వేగంగా జరుగుతున్నాయి.