ఎమర్జెన్సీ గదిలోకి చెప్పులు వేసుకుని రావద్దన్న వైద్యుడిపై దాడి చేసిన రోగి కుటుంబసభ్యులు (వీడియో)
గుజరాత్ భావ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ గదిలోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేయమని చెప్పిన వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కొంతమంది పురుషులు ఓ మహిళా రోగితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. దాడికి ముందు నిందితులు, డాక్టర్ మధ్య వాగ్వాదం జరగినట్లు వీడియోలో ఉంది. దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.