జమ్మూకాశ్మీర్​లో ముగిసిన మొదటి విడత ఎన్నికలు

58చూసినవారు
జమ్మూకాశ్మీర్​లో ముగిసిన మొదటి విడత ఎన్నికలు
జమ్మూకాశ్మీర్​లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటి దశ పోలింగ్ పూర్తయింది. మొత్తం 24 స్థానాలకు ఈరోజు పోలింగ్ నిర్వహించారు. దాదాపు 23లక్షల మంది ఓటర్లు 219 మంది అభ్యర్థులకు తమ ఓట్లను వేశారు. మొత్తం 59శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్‌ పీకే పోలె వెల్లడించారు. కిశ్త్‌వాడ్‌లో అత్యధికంగా 77శాతం ఓటింగ్ నమోదవగా.. పుల్వామాలో అత్యంత తక్కువగా 46శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపారు.

సంబంధిత పోస్ట్