ఆ తోడేలును బంధించేందుకు అటవీశాఖ అధికారులు సరికొత్త ప్రయత్నం

74చూసినవారు
ఆ తోడేలును బంధించేందుకు అటవీశాఖ అధికారులు సరికొత్త ప్రయత్నం
ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్‌ జిల్లాలో తోడేళ్ల దాడులు ఆగడం లేదు. ఓ తోడేలు బోనుకు చిక్కకుండా తిరుగుతోంది. దీనిని మగ తోడేలుగా భావిస్తున్న అధికారులు, ఆడ తోడేలు ఊళ రికార్డును వివిధ ప్రాంతాల్లో వినిపిస్తున్నారు. ఒకవేళ మగ తోడేలు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లయితే, ఆ ఊళ విని వస్తుందని, బంధించడం సులువవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు డివిజినల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అజిత్‌ ప్రతాప్‌ సింగ్‌ మీడియాకు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్