Oct 27, 2024, 08:10 IST/
ఆర్టీసీలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
Oct 27, 2024, 08:10 IST
ఆర్టీసీలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్లోని మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్‌ను ప్రారంభించి మాట్లాడారు. 'మరికొద్ది రోజుల్లో డ్వాక్రా మహిళలు బస్సు యజమానులుగా మారతారు. వాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయిస్తాం. ఆ వాహనాలను ఆర్టీసీకి అద్దెకు ఇప్పిస్తాం. ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం' అని చెప్పారు.