జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. ఓ అభిమాని తల్లి ఆవేదన (వీడియో)
ఆదుకుంటానని హామీ ఇచ్చిన సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని ఓ అభిమాని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తారక్ వీరాభిమాని కౌశిక్ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. దేవర సినిమా చూసి చనిపోవాలనుందని, అదే తన చివరి కోరిక అని కౌశిక్ చెప్పాడు. ఇది చూసిన తారక్.. అతడిని ఆదుకుంటానని గతంలో వీడియో కాల్ ద్వారా హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ సాయం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని కౌశిక్ తల్లి తెలిపారు.