2019లో ఆర్టికల్ 370 రద్దవ్వడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా MLAలకు ఇప్పటి వరకు తొలి నెల వేతనం అందలేదని తెలిసింది. ఈ విషయం శాసనసభ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ దృష్టికి వెళ్లింది. దీనిపై వివరణ కోరుతూ ఆయన జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాశారు.