AP: స్టాక్ మార్కెట్‌లో నష్టపోయిన ఓ HM ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మురుకు చెందిన భాస్కర్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో అప్పులు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. అందులో లాస్ రావడంతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.