కాట్రేనికోన: గ్రామాల అభివృద్ధి పై శిక్షణా తరగతులు
కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం గ్రామాల అభివృద్ధి పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎంపీడీవో వెంకటాచలం అధ్యక్షతన జీ. పీ. డీ. పీ, బీ. పీ. డీ. పీ కార్యాచరణ ప్రణాళిక 2025-26 శిక్షణలో భాగంగా మొదటి రోజు కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో మాట్లాడుతూ. గ్రామాల అభివృద్ధి అందరి సహకారంతో ముందుకు సాగాలన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.