

కాట్రేనికోన: పాముకు నీరు పట్టించి దాహం తీర్చిన స్నాక్ క్యాచర్
కాట్రేనికోన మండలం చెయ్యేరు పరోధిలోని జలగుంటలో గవర రాంబాబు అనే వ్యక్తి ఇంట్లో బుధవారం రాత్రి తాచుపాము ప్రవేశించింది. భయబ్రాంతులకు గురైన ఇంట్లోని వ్యక్తులు భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అతను తాచుపామును చాకచక్యంగా బంధించారు. అనంతరం ఆ పాము పరిస్థితిని గమనించి దానికి నీళ్లు పట్టించారు. ఒక డబ్బాలో బంధించి నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టారు.