సామర్లకోట: భద్రత నిభందనలు పాటించాలి
బాణాసంచా విక్రయాలు చేయడంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయాలకు లైసెన్స్ పొందిన వ్యాపారులు, తయారీ దారులతో తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సదస్సు నిర్వహించారు. గతంలో చేసినట్లుగానే, వేట్లపాలెం, సామర్లకోట ప్రభుత్వ కళాశాల మైదానాల్లో మాత్రమే భద్రతా పరికరాలతో వ్యాపారాలు చేయాలని ఆదేశించారు.