దేవీపట్నం పర్యాటక బోట్ పాయింట్ జనాలతో కిక్కిరిసిపోయింది. పాపికొండల విహారయాత్రకు గురువారం భారీ సంఖ్యలో పర్యాటకులు వెళ్లినట్లు టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. 15 పర్యాటక బోట్లలో 1048 మంది గోదావరి నదిలో బోట్లపై విహారయాత్రకు వెళ్లారని చెప్పారు. వారందరికీ లైఫ్ జాకెట్లు ఇచ్చినట్లు గురువారం తెలిపారు.