1న పల్నాడు జిల్లాలో సీఎం పర్యటన
AP: CM చంద్రబాబు జనవరి 1న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొననున్నారు. తొలుత గురజాలలో పర్యటిస్తారని ప్రచారం కాగా, దానిలో మార్పులు చేశారు. బీసీ ప్రతినిధి ఉన్నచోట కార్యక్రమం నిర్వహించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో అక్కడకు మార్చినట్లు తెలిసింది. సీఎం అన్నవరంలో పింఛన్లు పంపిణీ చేస్తారని సమాచారం.