డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.45-9.50 గంటల మధ్య లోయర్ బాల్కనీలో తొక్కిసలాటలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న రేవతి, శ్రీతేజ్‌లను బయటకు తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే రాత్రి 9.16కు రేవతిని బయటికి తీసుకొస్తున్నట్లు ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ రా.9.40కి హాల్ లోపలికి వచ్చారని, అంతకుముందే తొక్కిసలాట జరిగిందని పలువురు పోస్టులు చేస్తున్నారు. కాగా సీసీ ఫుటేజీ అరగంట ఆలస్యంగా ఉన్నట్లు పోలీసులు చెప్పినట్లు సమాచారం.