హైదరాబాద్ వాసులకు ఫేవరెట్.. ఉదయం దోశ, రాత్రి బిర్యానీ

59చూసినవారు
హైదరాబాద్ వాసులకు ఫేవరెట్.. ఉదయం దోశ, రాత్రి బిర్యానీ
హైదరాబాద్ వాసులు ఉదయం దోశ, రాత్రి బిర్యానీని ఇష్టంగా తినేస్తున్నారు. ఉదయం ఎక్కువగా దోశనే ఆర్డర్ చేస్తున్నట్లు స్విగ్గీ తెలిపింది. 17.54 లక్షల ఆర్డర్లతో దేశంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నట్లు చెప్పింది. అలాగే, నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్‌ చేస్తున్నారని, ఏడాదిలో ఏకంగా 1.57 కోట్ల ప్లేట్ల బిర్యానీలను ఆరగించారని పేర్కొంది. ఒక వ్యక్తి ఈ ఏడాదిలో 60 బిర్యానీల కోసం ఏకంగా రూ.18,840 వెచ్చించినట్లు చెప్పింది.

సంబంధిత పోస్ట్