
TG: 2 రోజులు సెలవులు మంజూరు
తెలంగాణలో రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న ఈద్ ఉల్ ఫితర్తో పాటు ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న కూడా సెలవు ఇచ్చింది. ఇక మార్చి 28న జమాతుల్-విదా, షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనారిటీ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 31న మాత్రమే సెలవు ఇచ్చారు.