2014 నాటికి తెలంగాణలో మొత్తం అప్పు రూ.90,160 కోట్లుగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఆ అప్పును రూ.6,69,257 కోట్లకు పెంచిందని అన్నారు. అంతేకాకుండా రూ.40,154 కోట్ల పేమెంట్స్ పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. మొత్తం మీద వారి పాలనలో రాష్ట్రం రూ.8,19,151 కోట్ల అప్పులోకి వెళ్లిందని విమర్శించారు. ఇక వాళ్లు సాధించిన ఘనత ఏమిటో వాళ్లే చెప్పాలని దుయ్యబట్టారు.