తిరువూరు: విద్యుత్ సబ్ స్టేషను ఎదుట ధర్నా
తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు విద్యుత్ సబ్ స్టేషను ఎదుట ట్రూ అప్ చార్జీలు ఉపసంహరించాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ఈ చార్జీలను వసూలు చేయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.